ఉపాధ్యాయులు గుణాత్మక విద్యను అందించాలి

55చూసినవారు
ఉపాధ్యాయులు గుణాత్మక విద్యను అందించాలి
చిలుకూరు మండలం సీతా రామాపురం ప్రాథమిక పాఠశాల ను జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. నేరుగా తరగతి గది లోకి వెళ్లి నల్ల బల్ల పై రాసిన పదాలను చదివించారు. అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు కనీస సామర్ధ్యాలను నేర్పించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎంఇఓ సలీం షరీఫ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్