కోదాడలో రంజాన్ పర్వదిన సందడి

585చూసినవారు
కోదాడ పట్టణంలో రంజాన్ సందడి కమ్ము కొచ్చింది. పండుగకు ఒక్క రోజే సమయం ఉండడంతో బుధవారం ఎండను సైతం లెక్కచేయకుండా ముస్లింలు కొనుగోళ్లలో మునిగి తేలారు. పర్వదినం స్పెషల్ వంటకం సేమియా పాయసం కావడంతో సేమియాలు, వాటిలో వేసే డ్రై ఫ్రూట్స్, ఇతర సుగంధ ద్రవ్యాలకు కొనుగోలుకు దుకాణాలలో కిక్కిసారు. పండుగ రోజున కొత్త బట్టలు, చెప్పులు, టోపీలు ధరించడం ఆనవాయితీగా వస్తుండడంతో ఈ దుకాణాల వద్ద సందడి నెలకొన్నది.

సంబంధిత పోస్ట్