మూసీ గేట్లు ఎత్తడంతో ఆదివారం నల్గొండ జిల్లా కేతపల్లి మండలం సోమవారం గ్రామం వద్ద పశువుల కాపరులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వరదలో చిక్కుకున్న గంగయ్య, బాలయ్యను సురక్షితంగా కాపాడారు. జేసీబీ సాయంతో బయటకు తీసుకొచ్చారు. ఒక్కసారిగా నీరు చుట్టుముట్టాయని పశువులు కాపారులు చెప్పారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.