ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా ఉప ఎన్నిక

77చూసినవారు
ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా ఉప ఎన్నిక
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీటెక్కిస్తోంది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పట్టుదలతో వ్యవహరిస్తున్నాయి. ఈ ఎన్నికల్లోనూ బలమైన ఓట్లు సాధించాలని బీజేపీ భావిస్తోంది. ప్రచారానికి ఇంకా మూడు రోజులే గడువు ఉండటంతో అభ్యర్థుల తరపున కీలక నేతలను రంగంలోకి దింపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్