చివ్వెంల మండలం చందుపట్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీaలకు డబ్బులను ఇవ్వకుండా గత నాలుగు రోజుల నుండి ఇబ్బందులు పెడుతున్నారని గురువారం 100 మంది పెన్షన్ దారులు, 50 మంది ఉపాధి హామీ కూలీలు పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు నగేష్ మాట్లాడుతూ చందుపట్ల బిపియం ఉపాధి హామీ కూలీలు, పెన్షన్ దారులు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. సిబ్బంది సకాలంలో ఆఫీసుకు వచ్చి ఉపాది హామీ కూలీలకు డబ్బులు పంపించాలని కోరారు.