ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 7న జరిగే బంద్ కరపత్రం శుక్రవారం జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఐ.ఎఫ్.టి.యు నాయకులు పోలేబోయిన కిరణ్ మాట్లాడుతూ రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్లకు ఉద్యోగ భద్రత, ఉపాధి గ్యారెంటీ లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికై కార్మికులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని అన్నారు.