ఈ రోజు తెలంగాణ సర్కార్ హిమాచల్‌ప్రదేశ్‌తో జల విద్యుత్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణ పరిరక్షణకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కుతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 520 మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యుత్ వనరుల విస్తరణ, గ్రీన్ పవర్ లక్ష్యసాధనలో ఈ ఒప్పందం కీలకమని, రాష్ట్రానికి ఆర్థికంగా మేలు జరుగుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.