TG: పెళ్లిల్లు, ఫంక్షన్ల వద్ద మిగిలిపోయిన ఆహారాన్ని నిర్వాహకులతో మాట్లాడి పేదలకు పెడుతున్న శివకుమార్ అనే తెలంగాణ యువకుడు జాతీయ యువజన పురస్కారానికి ఎంపికయ్యారు. 5వ తరగతి చదివే సమయంలోనే సేవా సంస్థ స్థాపించిన శివ 13 ఏళ్లుగా పాస్లిక్ నిర్మూలన, వ్యవసాయాభివృద్ధి, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తనకు అవార్డు రావడం ఆనందంగా ఉందని, యువతకు స్వయం ఉపాధి కార్యక్రమాలపై ఆలోచిన్నట్లు శివ చెప్పారు.