హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూముల వేలం వేయడానికి వ్యతిరేకంగా పలువురు విద్యార్థులు నిరసనకు దిగారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. మరోవైపు పోలీసులు తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియట్లేదని కొందరు విద్యార్థులు వీడియో రిలీజ్ చేశారు.