పారిస్ ఒలింపిక్స్‌లోనూ పతకం లక్ష్యంగా బరిలోకి దిగిన పీవీ సింధుకు ప్రిక్వార్టర్స్‌లో చుక్కెదురైంది. చైనీస్ ప్రపంచ నంబర్ 9 ర్యాంకర్ బింగ్ జావో రన్ చేతిలో 21-19, 21-14 తేడాతో ఓటమిపాలైంది. 56 నిమిషాల పాటు సాగిన పోరులో వరుస గేముల్లో సింధు ఓటమిపాలైంది. డిఫెన్స్‌లో తప్పులు చేయడం వల్ల ఓడినట్లు పీవీ సింధు వెల్లడించింది. ’ఈ ఓటమికి నేనేం పశ్చాత్తాప పడటం లేదు. పోరాడుతూనే ఉంటా‘ అని సింధు తెలిపింది.