బాలికను గొంతు కోసి చంపిన నిందితుడు అరెస్ట్

92178చూసినవారు
బాలికను గొంతు కోసి చంపిన నిందితుడు అరెస్ట్
కర్ణాటకలోని మడికేరిలో బాలికను గొంతు కోసి చంపిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్లబ్బి గ్రామానికి చెందిన ప్రకాష్ (32)కి అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరికి నిశ్చితార్ధం జరిగింది. ఈ పెళ్లిని అధికారులు నిలిపి వేశారు. అనంతరం కోపంలో బాలిక ఇంటికి వెళ్లి ఆమెను బయటకు లాక్కొచ్చాడు. తర్వాత గొంతు కోసి చంపాడు. అడవిలో దాక్కున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్