బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో వింత ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్న ఉదంతం కుచాయికోట్ పిఎస్ పరిధిలో వెలుగుచూసింది. బెల్వా నివాసి అయిన అత్త, ఆమె మేనకోడలు శోభను ససముసాలోని దుర్గా భవానీ ఆలయంలో వివాహం చేసుకుంది. అయితే ఇక్కడ అత్త మెడలో కోడలు తాళి కట్టడం విశేషం. తన మేనకోడలిపై ప్రేమతో అత్త.. భర్తను కూడా వదిలేసింది. మేనకోడలు అందంగా ఉందని.. మరెవరినైనా పెళ్లి చేసుకుంటే తనని వదిలేస్తుందేమోనని భయపడ్డట్లు అత్త పేర్కొంది.