నుజ్జునుజ్జయిన కారులో బాలుడు నరకయాతన

68చూసినవారు
నుజ్జునుజ్జయిన కారులో బాలుడు నరకయాతన
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంది దగ్గర NHపై వెళ్తున్న ఓ కారును రెండు లారీలు ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. ఒక బాలుడు మాత్రం కారులోనే ఇరుక్కుపోయి దాదాపు రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. కారు ముందు భాగంలో కాళ్లు ఇరుక్కుపోయి విలవిల్లాడుతున్న బాలుడికి దైర్యం చెబుతూ జేసీబీ, గునపాల సాయంతో అతి కష్టం మీద బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు.

సంబంధిత పోస్ట్