తెలంగాణలో మహిళలు ఖచ్చితంగా వారి ఫోన్లలో ఈ 4 నెంబర్లు సేవ్ చేసుకోవాలి. వీటి ద్వారా ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి తక్షణ సహకారం, రక్షణ పొందటానికి వీలు కలుగుతుంది. 181 మహిళా హెల్ప్‌లైన్ ఉంది. గృహహింస, పనిచేసే చోట వేధింపులు, లైంగిక, వరకట్న వేధింపులు, ఆడపిల్లల అక్రమ రవాణా, అమ్మకం సంబంధించి ఈ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఇంకా 8712630063 మహిళా భరోసా, 8712656858 తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం, చిన్నపిల్లల సంరక్షణకు 1098 నంబర్లు ఉన్నాయి.