బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి కిమ్ ఫెర్నాండేజ్ కన్నుమూశారు. 2022లోనూ కిమ్ గుండెపోటుకు చికిత్స తీసుకున్నారు. మార్చి 24న మరలా గుండెపోటు రావడంతో లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఐపీఎల్ ఆఫర్ వచ్చినా జాక్వెలిన్ వదులుకొని తల్లిని దగ్గరుండి చూసుకుంది. కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మరణించారు.