శ్రీరామ నవమి పండుగ వేళ కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అవనిగడ్డ మండలం మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు.. కొత్తపేట వద్ద ఉన్న కృష్ణా నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నదిలో ఒక యువకుడి మృతదేహం లభ్యమవ్వగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషాద ఘటనతో మోదుముడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.