రష్యాలోకి చొరబాటు చర్యలతో ఉక్రెయిన్ తమను రెచ్చగొడుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. కుర్స్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ చొరబాటును కవ్వింపు చర్యగా పేర్కొన్న ఆయన.. పౌర భవనాలు, అంబులెన్స్‌లపై కీవ్ సేనలు విచక్షణారహితంగా దాడులు జరుపుతున్నట్లు ఆరోపించారు. కుర్స్క్ ప్రాంతానికి సహాయ సహకారాలు అందించాలని మంత్రివర్గానికి సూచించారు.