ఫారెస్ట్ అధికారులకు జింక అప్పగింత

65చూసినవారు
ఫారెస్ట్ అధికారులకు జింక అప్పగింత
బొంరస్ పేట మండలం బాపల్లి తాండ పరిధిలోని పాల బాయి తాండ పరిధిలో సోమవారం కుక్కలు వెంబడించడంతో జింక తండాలోకి వచ్చింది. తాండాకు చెందిన యువకులు గమనించి దాన్ని పట్టుకున్నారు. జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు సూర్య నాయక్ బొలెరో వాహనంలో కొడంగల్ వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. కార్యక్రమంలో తాండ యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్