యాలాల్: స్పందించని విద్యుత్ అధికారులు

66చూసినవారు
యాలాల్: స్పందించని విద్యుత్ అధికారులు
యాలాల్ మండలం రాస్నం గ్రామంలో 3వా వార్డులో బ్యాగారి వేణు గోపాల్ ఇంటి ముందు ఉన్న కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ ను తొలగించాలని ఎలక్ట్రికల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అని గోపాల్ వాపోయారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ వల్ల గేదెలు, మేకలు , కోళ్లు ఎన్నోసార్లు మరణించాయి. ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని సోమవారం అక్కడి కాలనీవాసులు అడుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తొలగించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్