TG: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ముస్లిం సమాజం, మేధావులు వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఒవైసీ తాత వచ్చినా వక్ఫ బోర్డు బిల్లు ఆగదన్నారు. దేశ ప్రజలను, ఆస్తిపాస్తులను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ పార్టీ అంటూ మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం జాతీయవాద భావజాలంతో పనిచేస్తోందన్నారు.