జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో సోమవారం డీఎస్పీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భముగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ, ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.