మహబుబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల నరేష్ రెడ్డి ఇటీవల గుండెపోటు కు గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో చికిత్సపొందుతున్న నూకల నరేష్ రెడ్డిని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించి, కుటుంబసభ్యులకు దైర్యం చెప్పారు. నరేష్ రెడ్డి త్వరలోనే కోలుకుని ప్రజా సేవలో పాల్గొంటారని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.