ప్రతి నిరుపేదకు సంక్షేమ పథకాలను అందజేస్తామని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఆదివారం జిల్లాలోని శామీర్పేట్, పసరమడ్ల, బచ్చన్నపేట, నర్మేట గ్రామాల్లో జనగాం మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డు ఇందిరమ్మ కాలనీలో 4వ రోజు కొనసాగుతోన్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి నిశితంగా పరిశీలించారు.