బలపాల గ్రామంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు..
కురవి మండలంలోని బలపాల గ్రామంలో శ్రీ హనుమాన్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 34వ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఆగమన శాస్త్ర ప్రకారం వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా హనుమాన్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుడు వేముల శ్రీను మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా రంగురంగుల వినాయకుడు వద్దు మట్టి వినాయకుడె ముద్దు అనే నినాదంతో మట్టి వినాయకుడిని నెలకొల్పినట్టు తెలిపారు.