ఇల్లందు: మిర్చి క్వింటాకు 25 వేల మద్దతు ధర ఇవ్వాలి

67చూసినవారు
ఇల్లందు: మిర్చి క్వింటాకు 25 వేల మద్దతు ధర ఇవ్వాలి
మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గ గార్ల మండలంలోని కోటియ తండా, ముత్తి తండా గ్రామాలలో తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మిర్చి కల్లాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య హరినాయక్ రైతులను కలిసి మిర్చి పంటకు గిట్టుబాటు ధర విషయంలో ఎకరాకు ఎంత పెట్టుబడి ఖర్చు వస్తుంది రైతుకు ఎటువంటి ధర ఉంటే గిట్టుబాటు అవుతుంది అనే వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్