సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపిన ఆదివాసీ సంఘాలు

66చూసినవారు
సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపిన ఆదివాసీ సంఘాలు
ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటిడిఏ కార్యాలయంలో ఎదుట తుడుందెబ్బ, అనుబంధ విద్యార్థి, మహిళా సంఘాల, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు. ఐటిడిఏలో వివిధ శాఖలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించి, స్పెషల్ డీఎస్సీ, టిఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ఐటిడిఏలో 29 శాఖలలో స్థానిక ఆదివాసీ ప్రజలకు రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రత్యేక చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్