సమ్మక్క బ్యారేజ్ వద్ద మొసలి కలకలం

53చూసినవారు
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ వద్ద సోమవారం మొసలి కలకలం సృష్టించింది. గోదావరి నీటిలో నుంచి నేరుగా బ్యారేజీపైకి మొసలి వచ్చింది. అటుగా వెళ్తున్న పలువురు స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారి బాలరాజు తన సిబ్బంది ఆధ్వర్యంలో హాని తలపెట్టకుండా మళ్లీ గోదావరి నీటిలోకి సురక్షితంగా పంపించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్