ములుగు మండలంలోని జంగాలపల్లి క్రాస్ రోడ్డు నుంచి ఎరుకలవాడ వరకు రూ. 80 లక్షలతో బిటి రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన గురువారం మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ కలిసి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు ఇంచార్జి సంపత్ రావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ నిర్మాణం ప్రాంతీయ అభివృద్ధికి మేలు చేయాలని ఆశిస్తున్నామన్నారు.