ములుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సీపీఎం, సీపీఐ, డీవైఎఫ్వై సంఘాల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని, దేశ ప్రజలకు అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హోం శాఖ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలన్నారు.