ములుగు జిల్లాలోని తెలంగాణ తల్లి విగ్రహాలన్నిటికీ మంగళవారం పాలాభిషేకం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి తెలిపారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహంలో తలపై కిరీటం, చేతిలో బతుకమ్మ, కాళ్లకు కడియాలు మాయమయ్యాయన్నారు. అందుకు బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందన్నారు.