ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అడవుల్లో ఆదివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ తో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏటూరు నాగారం మండలానికి సమీప అడవుల్లోనే జరగడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులు తెలంగాణలోకి తలదాచుకునేందుకు వచ్చారా.? లేక డిసెంబర్ 2 నుండి జరగనున్న మావోయిస్టుల వారోత్సవాల కోసం తమ ఉనికి చాటుకునేందుకు వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.