వరంగల్ జిల్లా నర్సంపేటలో మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను మంగళవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్దులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదు పెట్టెలో ఉన్న పత్రాలను పరిశీలించిన అనంతరం భోజనం నాణ్యతను పరిశీలించారు.