మంచినీటి పథకం పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు

77చూసినవారు
మంచినీటి పథకం పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు
వరంగల్ జిల్లా నర్సంపేటలో అమృత్ 2. 0 పథకం ద్వారా 30. 49 కోట్ల రూపాయలతో మంచినీటి పథకం పనులకు జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ లు గురువారం శంకుస్థాపన చేశారు. నర్సంపేట పట్టణంలోని మహిళా జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, రామచంద్రనాయక్ పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్