మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి లను హైదరాబాద్ లో అక్రమ అరెస్టుకు నిరసిస్తూ వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.