నర్సంపేట: బాల బాలికల రక్షణ కోసం పాటు పడాలి
ప్రపంచ బాలల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా నర్సంపేట పట్టణంలోని స్వయం కృషి సోషల్ వర్క్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ వారి సహకారంతో మంగళవారం ఓ ప్రైవేటు పాఠశాలలో బాల బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలలపైన జరిగే అన్ని రకాల వేధింపులను సమాజంలోని ప్రతీ ఒక్కరు వ్యతిరేకించి బాల బాలికల రక్షణ, సంరక్షణల కొరకు పాటుపడాలని పిలుపు నిచ్చారు.