ఈ నెల 9న కోల్‌కతాలోని ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో విధుల్లో ఉన్న మహిళ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనపై జనగాం జిల్లా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో నిరసన ర్యాలీ నిర్వహించారు. శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మండల ఆర్ఎంపి సంఘం, ప్రభుత్వడాక్టర్స్, నర్సులు, బహుజన సంఘం, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు నిరసన ప్రదర్శనలో పాల్గొనినిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు.