ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి విముక్తి కల్పించడానికి తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధన కోసం పునరంకితం కావాలని పరకాల ఆర్డిఓ డాక్టర్ కె. నారాయణ కోరారు. 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గురువారం పరకాల రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో డాక్టర్ కె. నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగధనుల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు.