ధర్మసాగర్ మండలం లోని జేఎస్ ఎం పౌల్ట్రీ ఫార్మ్ యజమాని తక్కళ్ళపల్లి కిషన్ రావు మండల పరిధిలో రేషన్ బియ్యం సేకరించిన 11 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ బాబులాల్ సోమవారం సాయంత్రం తెలిపారు. వీటి విలువ 29 వేల వరకు ఉంటుందని, తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు ఆయన తెలిపారు.