ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ పార్టీ రాస్తా రోకో చేపట్టింది. ఈ సందర్బంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఇంచార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు తీరని ద్రోహం చేస్తుందని, వారి న్యాయ సంబంధమైన డిమాండ్లు తీర్చడం లేదని, కేసీఆర్ నియంత పోకడతో కార్మికులకు తీరని నష్టం చేస్తున్నారని, ఇది సరైన పద్దతి కాదని, కావున బీజేపీ ప్రభుత్వం వారికి పూర్తి మద్దతుగా ఈ రాస్తా రోకో చేపట్టడం జరిగిందని ఈ సందర్బంగా ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగే వరకు వారి తరపున పోరాడుతుందని ఈ సందర్బంగా చెప్పారు. ఇకనైనా కేసీఆర్ తన ధోరణి మార్చుకోవాలని, లేకపోతే బీజేపీ ప్రభుత్వం అందుకు తగిన విధంగా కార్యాచరణ ప్రారంభిస్తుందని, పోరాడుతుందని, తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ సాయిబాబు రాచర్ల, ఎనుగాల యుగంధర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు, ఐలోని అంజిరెడ్డి, జిల్లా సెక్రటరీ గుర్రం వెంకన్న, దళిత మోర్చా ఉపాధ్యక్షులు, చాగంటి ఉపేందర్, రుద్రపు నర్సింహులు, జిల్లా ప్రచార నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.