వరంగల్ జిల్లా కోర్టులో బాంబు కలకలం లేపిన ఘటన శుక్రవారం జరిగింది. జిల్లా జడ్జికి మెయిల్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తి బాంబు పెట్టినట్లు సమాచారం అందించాడు. దీంతో సమాచారం అందుకున్న వరంగల్ బాంబ్ స్క్వాడ్ కోర్టు ప్రాంగణం చేరుకొని తనిఖీలు నిర్వహించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.