కాజిపేట్ ప్రాంతంలో ఆక్రమణలపై బల్దియా అధికారులు దృష్టి సారించారు. పాదచారులు నడిచే నడకదారుల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు, దుకాణాలు సైన్ బోర్డులను తొలగించారు. బల్దియా కమిషనర్ అశ్విని తనాజీ వాకదే ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు నడుమ కాజీపేట నుండి మడికొండ కూడలి వరకు ఆక్రమణలను తొలగించారు.