ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో 2కే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సంవత్సర కాలంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.