ఏపీలో రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్, 8.30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుందని సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామన్నారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుల్స్, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్.. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుల్స్, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయని తెలిపారు.