వార ఫలాలు (27-03-2022 నుంచి 02-04-2022)

38745చూసినవారు
వార ఫలాలు (27-03-2022 నుంచి 02-04-2022)
మేషం
ఈ వారంలో మీరు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. వారం చివరిలో వ్యయప్రయాసలు ఉంటాయి.

వృషభం
మీ కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. కొత్త పనులు ఆటంకం లేకుండా కొనసాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. రుణవిముక్తి లభిస్తుంది. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహించే వీలుంది. వాహనాలు, ఇళ్ల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు.

మిథునం
వారం ప్రారంభంలో సమస్యలు ఎదురవుతాయి. అయితే పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగుతాయి. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో హోదాలు అనూహ్యంగా దక్కుతాయి. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

కర్కాటకం
మీరు చేపట్టిన పనులకు ఆత్మీయులు, బంధువుల సహకరిస్తారు. దీంతో వారి సాయంతో సమస్యలు అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. చాకచక్యంగా వ్యవహరించి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలలో రావలసిన పైకం అందుతుంది. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. పారిశ్రామికరంగం వారికి చెప్పుకోతగిన అభివృద్ధి కనిపిస్తుంది.

సింహం
చేపట్టిన పనులు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుంది. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యతిరేకులు సైతం మీకు మద్దతుగా నిలుస్తారు. వాహనయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు రావచ్చు.

కన్య
ఆర్థిక వ్యవహారాలలో లాభసాటిగా మారుతాయి. ఆపదలో ఉన్న వారికి మీ వంతు సాయం అందిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల నుంచి అందిన సమాచారం మీలో నూతనోత్సాహం నింపుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు ఒత్తిడిని పెంచుతాయి.

తుల
చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలపై దృష్టిసారిస్తారు. ఉద్యోగ యత్నాలు కలసివస్తాయి. కొన్ని సమావేశాలకు నేతృత్వం వహిస్తారు. ఆర్థిక పరిస్థితి సమతూకంగా ఉంటుంది. అవసరాలకు తగినంత సొమ్ము సమకూరుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి.

వృశ్చికం
బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రశంసలు అందుకుంటారు. సమాజసేవలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. కళారంగం వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

ధనుస్సు
ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. కొత్తగా అప్పుల కోసం ఎదురు చూస్తారు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కొన్ని విషయాలలో మానసిక అశాంతికి లోనవుతారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం వీడక ముందుకు సాగడం మంచిది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. పనులలో అవాంతరాలు నెలకొని పరీక్షగా నిలుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనాలు కొంటారు.

మకరం
పరిస్థితులు అనుకూలిస్తాయి. దీంతో చేపట్టిన పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ కృషి, సేవలను కుటుంబసభ్యులు గుర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు.

కుంభం
ఆటంకం లేకుండా చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. మీ గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. మిత్రుల నుంచి ధనలాభ సూచనలు. రాబడి మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొద్దిపాటి పదవులు దక్కే సూచనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు ఏర్పడవచ్చు.

మీనం:
చేసిన తప్పులు తెలుసుకుని, చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, సన్నిహితుల నుంచి శుభవార్తలను వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో అంచనాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వివాహాది వేడుకలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఎంతటి వారినైనా చాతుర్యంగా ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగ విధుల్లో ఒత్తిడులు అధిగమిస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్