వరలక్ష్మీ వ్రతం వేళ.. ఏ రంగు చీర కట్టుకోవాలంటే..?

2588చూసినవారు
వరలక్ష్మీ వ్రతం వేళ.. ఏ రంగు చీర కట్టుకోవాలంటే..?
హిందూ మహిళలు వరలక్ష్మీ వ్రతం చేసే రోజు అమ్మవారి అనుగ్రహం పొందేందుకు ఏ రంగు చీరలు ధరించి పూజలు చేస్తే మంచిదో జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. లక్ష్మీదేవికి బంగారు రంగు చీర అంటే మహా ప్రీతి. లక్ష్మీకటాక్షం కోసం ఆకుపచ్చ రంగు.. సంపూర్ణ అమ్మవారి అనుగ్రహం కోసం గులాబీ రంగు ధరించాలట. అయితే నలుపు, నీలం, బూడిద రంగుల్లో ఉండే చీరలు మాత్రం ధరించవద్దని.. వీటిని ధరిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగకపోగా.. శని దేవుని ఆగ్రహానికి గురికావడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్