భువనగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా 23వ వార్డులోని ఇందిరానగర్ లో వార్డు సభ కార్యక్రమం బుధవారం స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ఆరు గ్యారెంటీ పథకాలు అర్హులైన నిరుపేద ప్రజలకు అందిస్తామన్నారు.