రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భువనగిరి పట్టణంలోని స్థానిక 33, 34వ వార్డులలో శుక్రవారం ఇంటింటికి పూల మొక్కలు, పండ్ల మొక్కలను మున్సిపల్ కమిషనర్ పి. రామాంజుల రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయబడుతాయని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి మొక్కలను నాటాలన్నారు.