లారీ యజమాని ఆత్మహత్య

3504చూసినవారు
లారీ యజమాని ఆత్మహత్య
లారీ డ్రైవర్‌ కమ్‌ ఓనర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని జనగాం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ సింగపంగ నగేష్‌ (30) సంస్థాన్‌ నారాయణపురంలోని పురాతన శివాలయం వద్ద లారీని పార్క్‌ చేసి, లారీలోనే వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికి లారీ అలాగే నిలిపి ఉండడం గమనించిన స్థానికులు చూడగా అచేతనంగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా పోలీసులు నగేష్‌ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. నగేష్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్