భువనగిరి: మృతుని కుటుంబానికి మాజీ ఉప సర్పంచ్ ఆర్థిక సహాయం అందచేత
భువనగిరి మండల పరిధిలోని ఆకుతోటబావితండా గ్రామానికి చెందిన ధరావత్ నరసింహ్మ ఇటీవల గత వారం రోజుల క్రితం అకస్మాత్తుగా మృతిచెందడంతో వారి కుటుంబ సభ్యులకు సూరెపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ కాసుల పాండు రంగం గౌడ్ రూ 5000, మాజీ ఎంపిటిసి ఎండీ ఇమాంబీ గులాం రసూల్ రూ 1000 ఆర్ధిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు బుధవారం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.