మక్తల్ పట్టణంలో పర్యటించనున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం మక్తల్ పట్టణంలో జరిగే మార్కెట్ కమిటీ నూతన పలక వర్గం ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే శ్రీహరి తెలిపారు. మొదట మండల పరిధిలోని భూత్పూర్ ముంపు గ్రామాన్ని సందర్శిస్తారని చెప్పారు. అనంతరం మార్కెట్ ఛైర్మెన్ రాధ లక్ష్మారెడ్డి, వైస్ చైర్మన్ గణేష్ కుమార్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.